A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
Share |
June 17 2019, 2:03 pm

వెనుకబడిన తరగతులలో ఉన్న వెలమ కులస్తులకోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని విపక్ష నేత జగన్ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో ఆ వర్గం వారు ఆయనను కలిశారు వెలమ కులానికి చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు వైఎస్‌ జగన్‌ను కలిసి తమకూ కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలని కోరారు. జాతీయ వెలమ యూత్‌ (శ్రీకాకుళం), బీసీ వెలమ సంక్షేమ సంఘం (విజయనగరం జిల్లా), వెలమ కార్పొరేషన్‌ జేఏసీ (విశాఖ) ప్రతినిధులు ఈ మేరకు వినతిపత్రాలిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వెలమల అభివృద్ధికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. తాము ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లివ్వాలని, ప్రతి జిల్లాలో వెలమ సంక్షేమ భవనాలను నిర్మించి హాస్టల్‌ వసతి కల్పించాలని కోరారు. వెలమలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని వైఎస్‌ జగన్‌ వారికి హామీ ఇవ్వడంతో ఆయా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జగన్‌ను కలిసిన వారిలో వెలమ సంఘాల ప్రతినిధులు టి.సత్యనారాయణ, బండారు సతీష్‌కుమార్, డి.రామ్‌ప్రసాద్, సిరిపురపు గౌరీశంకర్, కోరుపోలు సత్యారావు, నర్సింగరావు తదితరులున్నారు.

tags : jagan, velama,corporation

Latest News
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info