A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
Share |
January 18 2019, 12:35 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తెల్లకాగితం వంటి వారని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు.రాజకీయాలలో అవినీతి పెరిగిపోయిందని, ఇష్లానుసారం డబ్బు వెదజల్లి గెలవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో కుల వివక్ష ఉందని ఆయన అన్నారు.పార్టీ అదినేత ఎక్కడ నుంచి పోటీచేయమంటే అక్కడ నుంచి పోటీచేస్తానని ఆయన చెప్పారు.జనసేన మద్దతుదారులే లక్ష్యంగా ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆయన ఆరోపించారు.. పేరొందిన ఒక ప్రైవేటు సర్వే సంస్థ గడచిన కొద్ది మాసాలుగా ఓట్లను తొలగించే కుట్రలో నిమగ్నమై ఉన్నట్టు ఆరోపించారు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి దీనిని అడ్డుకోవాలని కోరారు. కుల వివక్షత, స్వార్ధపూరిత రాజకీయాలు, ఒంటెద్దుపోకడ నచ్చక తాను తెలుగుదేశం నుంచి వైదొలగినట్టు ఆయన చెప్పారు.. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తారన్న నమ్మకంతోనే పవన్‌ నాయకత్వాన ఏర్పడిన జనసేనలో చేరానని కిషోర్ బాబు తెలిపారు.

tags : ravela,kishore, pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info