A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
Share |
January 18 2019, 12:44 pm

అప్పుడే ఆయా రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరదీస్తున్నాయా?ఈసారి కాంగ్రెస్ పై ఆరోపణ రావడం విశేషం.చేవెళ్ల ఎమ్.పి , టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రయత్నాలు ఆరంభించారట. నాగర్ కర్నూలు నుంచి టిఆర్ఎస్ అబ్యర్ధిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దనరెడ్డిని ఆకర్షించడానికి విశ్వేశ్వరరెడ్డి యత్నించారట.మర్రి ఈ విషయం చెబుతూ జానారెడ్డి ఇంటిలో మాట్లాడుకుందాం అని విశ్వేశ్వరరెడ్డి పోనో చేశారని వెల్లడించారు.
టీ ఆర్ ఎస్ పార్టీ తరపున గెలవబోయే అభ్యర్థులను కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు వత్తాసు పలకకుండా ఆయన మాయలో నుంచి బయటకు రండి అని విశ్వేశ్వర్ రెడ్డికి చెప్పి ఫోన్ పెట్టేసినట్లు మర్రి తెలిపారు. పదవులకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం తమది కాదని.. తమది కేసీఆర్ సైన్యం అని మర్రి జనార్ధన్ రెడ్డి తేల్చిచెప్పారు. లగడపాటి సర్వేలతో ప్రజలను గందరగోళానికి గురి చేసి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం మంచిది కాదన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని.. 80 నుంచి 85 స్థానాలు టీ ఆర్ ఎస్ కైవసం చేసుకుంటుందని మర్రి జనార్ధన్ రెడ్డి చెప్పారు.

tags : telangana, trs, phone

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info