A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
Share |
June 17 2019, 2:13 pm

కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ముఖ్యమంత్రి అభ్యర్ధులు రేసులో వెనకబడిపోయారని నవ తెలంగాణ పత్రిక ఒక ఆసక్తికర కదనాన్ని ఇచ్చింది. అలాగే టిర్ఎస్ నుంచి ముగ్గురు మంత్రులు కూడా ఓడిపోయే అవకాశం ఉందని తెలిపింది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


అతి ముఖ్యమైనవిగా భావిస్తున్న 20 నియోజక వర్గాల్లో పోలింగ్‌ తర్వాత చేసిన సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో 10 స్థానాల్లో టీఆర్‌ఎస్‌, 6 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యత కనపరుస్తుండగా నాలుగు నియోజక వర్గాల్లో గట్టి పోటీ నెలకొని ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీని దక్షిణ తెలంగాణ గట్టెక్కిస్తుందని ఆ పార్టీ మొదటి నుంచి నమ్ముతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలోనే పార్టీ ప్రముఖ నేతలు ఓటమి దిశగా పయనిస్తున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్‌ పార్టీ కంచు కోటగా భావిస్తున్న దక్షిణ తెలంగాణలోని ఒక జిల్లాలో పోటీ చేస్తున్న ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలు ఎదురీదుతున్నారు. అదే జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలు గట్టి పోటీ ఎదుర్కొం టున్నారు. ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పూర్తి స్థాయి ఆధిక్యత ప్రదర్శిస్తున్న ఒక జిల్లాలో కాంగ్రెస్‌ ప్రముఖుడు ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నదని తాజా నివేదిక ద్వారా తెలుస్తున్నది. తాను కూడా ముఖ్యమంత్రి రేస్‌లో ఉన్నట్టు ఇటీవల ఆయన ప్రకటించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి రేస్‌లో ఉన్న ఇద్దరు దళిత నేతలు గట్టెక్కే పరిస్థితి కనిపించటం లేదు. వీరిలో ఒకరు మహిళ కావటం విశేషం. ప్రజాకూటమిలోని ఒక భాగస్వామ్య పార్టీ నేత విజయం సాధించటం కష్టమేనని తెలుస్తున్నది. దక్షిణ తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి గట్టి పోటీ ఎదుర్కొంటుండగా అదే జిల్లాకు చెందిన ఒక మాజీ ఎంపీ వెనుకబడిపోయారని ఓటర్ల నాడిని చూస్తే ఆర్థమవుతున్నది.
కష్టాల్లో ముగ్గురు మంత్రులు....
అధికార పార్టీలో కీలక నేతలుగా ఉన్న ముగ్గురు ఆపద్ధర్మ మంత్రులు ఓటమి అంచున ఉండగా ఒక మంత్రి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. దక్షిణ తెలంగాణలో ఒక మంత్రి, ఉత్తర తెలంగాణలో ఇద్దరు మంత్రులు రేస్‌లో పూర్తిగా వెనుకబడి పోవటం విశేషం. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన మరో ఇద్దరు మంత్రులు తమ ప్రత్యర్ధుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ రెండు స్థానాల్లో ముందంజలో ఉండగా జిల్లా కేంద్రంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలో ఇటీవల వార్తల్లో నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ నేత దక్షిణ తెలంగాణలో గట్టిపోటీ ఎదుర్కొంటున్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించవచ్చు.

tags : telangana, congress, cm candidates

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info