A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
Share |
January 18 2019, 12:46 pm

తెలంగాణలో ప్రజా కూటమి నేతలు గవర్నర్ ను కలిసి హంగ్ వస్తే ముందు తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరాలని నిర్ణయించుకోవడం విశేషం. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు తమకు వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, మిశ్రమ ఫలితాలు వస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఎలా అడ్డుకోవచ్చన్న దానిపై వీరు చర్చ జరిపారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు సొంతంగా మెజార్టీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించిన పక్షంలో గవర్నర్‌ ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉందనే అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. కూటమిలోని అన్ని పార్టీలకు కలిపి టీఆర్‌ఎస్‌ కన్నా ఎక్కువ స్థానాలు వస్తే కూటమినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ముందుగానే గవర్నర్‌ను కోరాలని నిర్ణయించారు. ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకున్నందున సుప్రీంకోర్టు తీర్పు మేరకు కూటమికే అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాలని, ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించారు.

tags : telangana, hung

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info