A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
Share |
June 17 2019, 3:04 pm

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఏమి జరుగుతుంది?ఏ ఫలితం ఎలా వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి?ముఖ్యమంత్రి కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి రిస్కు తీసుకున్నారా?లేక ,అదే కలిసి వచ్చిందా అన్నది కూడా తేలుతుంది.ఒక మాట మాత్రం ఒప్పుకోవాలి.టిఆర్ఎస్ తేలికగా గెలుస్తుందన్న భావన నుంచి టఫ్ పోటీ అయిందన్న భావనను తీసుకురావడంలో కాంగ్రెస్,టిడిపి ,సిపిఐ,జనసమితిల ప్రజా కూటమి సఫలం అయిందని ఒప్పుకోవాలి.దీనికి కారణం ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అని చెప్పాలి.ఆయన తన ఆర్దిక వనరులు,రాజకీయ వ్యూహాలన్నిటిని ప్రయోగించి, మడియా ద్వారా టిఆర్ఎస్ ను కొంత మేర భయపెట్టగలిగారని ఒప్పుకోవాలి.తాను టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నా, కాంగ్రెస్ ను చెత్త పార్టీ అని గతంలో విమర్శించినా, ఇప్పుడు టిఆర్ఎస్ ను విమర్శించి, కాంగ్రెస్ ను భుజాన వేసుకున్నా, ఆయనకే చెల్లిందని చెప్పాలి.మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీ టిడిపితో సొబందం లేకుండా పోటీ చేసి ఉంటే పరిణామాలు ఒక రకరంగా ఉండేవి. కాని ఇంత ప్రచారం, మీడియా కవరేజీ.ఇంత డబ్బు వచ్చేదా అన్నది కాంగ్రెస్ వారి ప్రశ్నగా ఉంది. మరి తెలంగాణలో యాంటి చంద్రబాబు సెంటిమెంట్ నడవదా?అంటే ఎలాగోలా సర్దుబాటు చేసుకోవచ్చని కాంగ్రెస్ నేతలు భావించారు.ముఖ్యంగా రాహుల్ గాందీ స్థాయిలో చంద్రబాబు మేనేజ్ చేసుకుని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ నోరు ఎత్తలేకపోయారు.పైగా తక్కువ సీట్లు తీసుకోవడానికి కూడా చంద్రబాబు సిద్దపడిపోయారు. రాహుల్ గాందీతో కలిసి తిరిగితే చాలని ఆయన అనుకుంటే ,చంద్రబాబు డబ్బు,ఆయన ద్వారా మీడియా ప్రచారం వస్తే చాలని కాంగ్రెస్ నేతలు అనుకున్నారు.కాకపోతే ఇద్దరూ కలసి కాంగ్రెస్,టిడిపి కార్యకర్తల సెంటిమెంటును ,తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. అయినా ప్రజాకూటమి గెలిస్తే ఆసక్తికరమైన విషయమే అవుతుంది. సమాజం కూడా అలాంటి విలువలు లేని రాజకీయాలకు అలవాటు పడిందని అనుకోవాలి.రకరకాల సర్వేల ప్రకారం టిఆర్ఎస్ ఎంతో కొంత ఆధిక్యతతో బయటపడవచ్చు. సామాన్య జనంలో ప్రత్యేకించి పేద వర్గాలలో టిఆర్ఎస్ అనుకూలత కనిపించింది.కాస్త ఎగువ మద్య తరగతి, కొన్ని అగ్రవర్ణాలలో టిఆర్ఎస్ వ్యతిరేకత ఉంది.నిజంగానే కెసిఆర్ పై కూటమి నేతలు చెబుతున్నట్లు వ్యతిరేకత ఉంటే వారికి పూర్తి స్తాయిలో ఆదిక్యత వస్తుంది. కాని లగడపాటి రాజగోపాల్ కూడా దైర్యంగా ఆ మాట చెప్పినట్లు కనిపించలేదు.పైగా ఆయన చెబుతున్నదానిలో హేతుబద్దత లేదు.ఎమ్.ఐ.ఎమ్.కు ఏడు లేదా ఎనిమిది, బిజెపికి ఎనిమిది నుంచి పది, ఇండిపెండెంట్లకు పది సీట్లు వస్తే మిగిలిన తొంంభై సీట్లలో కాంగ్రెస్ అరవై సంపాదించగలగాలి. అలా వస్తే అప్పుడు అది కూటమి వేవ్ అవుతుంది. మరి ఆ పరిస్థితి ఉందా అన్నది సందేహం.టిఆర్ఎస్ కు ఏభై సీట్లు వచ్చి, ఎమ్.పిఏమ్. కు ఏడు సీట్లు వస్తే ఆ పార్టీ ప్రభుత్వంఏర్పాటు చేయడం సులువు అవుతుంది. ఎందుకంటే బిజెపి ఎటూ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వదు.ముగ్గురు,నలుగురు ఇండిపెండెంట్లు గెలిచినా వారిని టిఆర్్ఎస్ ఆకట్టుకుంటే సరిపోతుంది. అదే కాంగ్రెస్ కూటమికి ఏభై సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు కష్టం కావచ్చు.ఏదో ఒక పార్టీకి మెజార్టీ వస్తే ఈ చర్చలకు అవకాశమే ఉండదు. చంద్రబాబు ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్య మాదిరి తీసుకుని ఖర్చు పెట్టడం చేశారు.ఆయనకు పోటీగా కెసిఆర్ కూడా ఖర్చు చేశారు. కేవలం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒంటరిగా పోటీ చేసుకుని అదికారంలోకి వస్తే పెద్దగా సమస్యలు రావు. తెలంగాణ,ఎపిల మద్య విబేధాలు పెరగవు.ప్రజల మద్య వివాదాలు ఉండేవికావు.కాని చంద్రబాబు మద్దతుతో ప్రజా కూటమి అదికారంలోకి వస్తే మాత్రం బవిష్యత్తులో తెలంగాణ సెంటిమెంటు తెరపైకి రావచ్చు. టిఆర్ఎస్ ప్రతి అంశంలోను రకరకాల ఆందోళనలు చేపట్టవచ్చు. వారికి కాంగ్రెస్ లో మంత్రి పదవులు రానివారు సహజంగానే సహకరిస్తారు. ఇప్పటికే చంద్రబాబు కింగ్ మేకర్ అవుతారని టిడిపి మీడియానే బానర్లు కట్టీ వార్తలు ఇచ్చింది.అంటే కాంగ్రెస్ ఎటూ ఆయన కంట్రోల్ కు వచ్చింది. కెసిఆర్ విజయం సాదించకపోతే,చంద్రబాబుకు తెలంగాణలో కూడా ప్రస్తుతానికి ఎదురులేని పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ కు కూడా తానే దిక్కు అన్నట్లుగా చంద్రబాబు ,టిడిపి వారు వ్యవహరించే అవకాశం ఉంటుంది.అది సహజంగానే తెలంగాణలో మళ్లీ అబిమాన సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది.2009-2014 మద్య ఎలాంటి సంక్షోభాలను ఆంద్ర,తెలంగాణ ప్రజలు ఎదుర్కున్నారో,అలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కావచ్చు.కాంగ్రెస్ ఒంటరిగా గెలిస్తే ,టిఆర్ఎస్ కు ఆ అవకాశం ఉండేది కాదు. టిఆర్ఎస్ విజయం సాదిస్తే చంద్రబాబుకు టిఆర్ఎస్ కు మద్య రాజకీయ సమస్య ఉంటుంది తప్ప, ప్రాంతీయ గొడవ, ప్రజల మద్య విబేధాలకు ఆస్కారం ఉండకపోవచ్చు. ఒకరకంగా చూస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణలో నివసిస్తున్న సీమాంద్రులకు కొత్త టెన్షన్ పెడుతున్నట్లు లెక్క.తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు కళ్ల సిద్దాంతం అంటూ టెన్షన్ కు కారణం అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ తో జతకలిసి ఆయన ప్రమాదకరమైన ప్రయోగం చేశారు. ఆ ప్రయోగంలో ఆయన సఫలం అయితే తెలంగాణ సెంటిమెంట్ ప్రబలమే కాకుండా, సీమాంద్రులకు కొత్త సమస్యలు ఎదురు అవుతాయేమోనన్న అనుమానం కలుగుతుంది. అలా జరగకపోతే సంతోషమే.కాని రాజకీయాలు ఎప్పడూ ఒకే రకంగా ఉండవు కదా! తెలంగాణ ప్రజలతో పాటు ఆంద్ర ప్రజలకు కూడా ఈ ఎన్నికలు ఒక పరీక్షగా మారాయి.

tags : telangana, analysis

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info