A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
55 కోట్ల నగదు దొరికితే పెద్ద వార్త కాదా
Share |
January 18 2019, 12:48 pm

టిడిపి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన కంపెనీలపై ఐటి దాడులు చేసినప్పుడు ఏభై ఐదు కోట్ల రూపాయల నగదు దొరికి నట్లు కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి. ఇంత డబ్బు దొరికితే ఎందుకో ఎపి పత్రికలలో ప్రాదాన్యత రాలేదు. హైదరాబాద్ నుంచి వచ్చే ఒక తెలుగు పత్రికలో ఈ దాడులకు సంబందించిన వార్త ప్రముఖంగా వచ్చింది.దీని ప్రకారం మాగుంట కంపెనీలలో లెక్కలలో లేని ఏభైఐదు కోట్ల రూపాయల నగదు దొరికినట్లు వార్త వచ్చింది.రెండురోజుల పాటు ఈ దాడులు సాగాయి. వేరే చోట జరిపిన దాడులలో వచ్చిన సమాచారం ప్రకారం చెన్నై ఐటి శాఖ అధికారులు ఈ దాడులు జరిపారు.అయితే టిడిపి మీడియా మాత్రం ఇది టిడిపి నేతలను టార్గెట్ గా చేసుకుని దాడి అని కధనాలు ఇచ్చింది.నిజంగానే ఏభై ఐదు కోట్ల నగదు పట్టుబడితే అది పెద్ద వార్త కాదా!

tags : it, magunta, raids, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info