A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి. గిరిజన విద్యార్ధుల పర్వతారోహణ
Share |
June 16 2019, 3:03 am

ఇటీవలికాలంలో తెలంగాణలో విద్యార్దులు పర్వతారోహణలో పేరు తెచ్చుకుంటున్నారు.తాజాగా ఇలా ఘనత సాదించినవారిలో ఒక బాల్య వివాహ బాదితురాలు కూడా ఉన్నారు.
సిక్కిం రాష్ట్రంలో ఉన్న 18,200 అడుగుల ఎత్తైన లక్పకాంచీ పర్వత శిఖరాన్ని పన్నెండు మంది తెలంగాణ లోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల బృందం శుక్రవారం విజయవంతంగా అధిరోహించింది. వీరిలో మహేశ్వరి అనే విద్యార్థిని ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయి బాల్య వివాహ బాధితురాలు. ఈ అమ్మాయి హైదరాబాద్ హయత్‌నగర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో చదువుకొంటున్నది. ఈమెతోపాటు ఇదే కాలేజీలో చదువుకొంటున్న నలుగురు అమ్మాయిలు, ఎనిమిది మంది అబ్బాయిలు లక్పకాంచీ పర్వతాన్ని శుక్రవారం అధిరోహించారు. పర్వతాన్ని అధిరోహించిన మొదటి ఆదిమ గిరిజనతెగకు చెందిన విద్యార్థులుగా వీరు చరిత్ర సృష్టించారని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్‌బ్రస్ పర్వతాలను అధిరోహించిన మాలావత్ పూర్ణ నుంచి స్ఫూర్తిపొందినట్టు మహేశ్వరి తెలిపింది.

tags : mountaineering, students

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info