A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నైట్ క్లబ్ లొ తొక్కిసలాట- 6గురు మృతి
Share |
June 25 2019, 1:08 pm

నైట్ క్లబ్ లలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా, ఏదైనా గందరగోళం జరిగినా అనేక మంది మరణించడం,గాయపడడం జరుగుతోంది. ఇటలీలోని కారినాల్డో బ్లూ ల్యాంటర్న్ అనే నైట్‌క్లబ్‌లో సంగీత కచేరి సందర్భంగా పెప్పర్ స్ప్రే వంటి ఓ రకమైన గాఢమైన స్ప్రేను ఉపయోగించడం వల్ల క్లబ్‌లో గందరగోళం ఏర్పడింది. దాంతో అంతా ఒక్కసారిగా బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడు తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా, 120 మంది గాయపడ్డారు. నైట్ క్లబ్‌కు మూడు ద్వారాలు ఉన్నాయని.. అందులో ఒకదాని నుంచి బయటకు వచ్చేందుకు ఒకేసారి ప్రయత్నించారని తెలిపారు. కాగా గాయపడ్డ 120 మందిలో దాదాపు 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. నైట్‌క్లబ్‌లోని కచేరీ నిర్వహించిన ప్రాంతం కేవలం 870 మందికి మాత్రమే సరిపోతుందని.. కానీ 1400 టిక్కెట్లు విక్రయించారని ఘటనపై దర్యాప్తు చేస్తున్న అదికారులు చెప్పారు. నైట్‌క్లబ్‌లో బయటకు వెళ్లడానికి యువత ఉపయోగించిన ద్వారానికి కారు పార్కింగ్‌కు మధ్య ఒక చిన్న వంతెన ఉన్నది.జనం ఒక్కసారిగా దానిపైకి రావడంతో ఆ వంతెన కూలిపోయింది. దీంతో పదుల సంఖ్యలో జనం కింద పడిపోయారు. ఆందోళనలో ఉన్న మిగతావారు కిందపడిన వారిని తొక్కుకుంటూ వెళ్లారు అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కదనం.

tags : italy, nigh club

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info