A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఫోటో మిస్సింగ్ ..కారణమేమిటో
Share |
April 23 2019, 3:26 am

తెలంగాణ కాంగ్రెస్ ఆద్వర్యంలో ఇచ్చిన ప్రచార ప్రకటనను గమనించారా? గత కొన్నాళ్ళుగా ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ పక్కన టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు బొమ్మ ప్రముఖంగా ఉండేది. వారికిందే తెలంగాణ నేతల బొమ్మలు వేసేవారు. పిసిసి అద్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి పోటోకు కూడా ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. టిడిపి నేత ఎల్.రమణ, టిజెసి అద్యక్షుడు కోదండరామ్, సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలతో పాటు ఉత్తం పోటో కూడా చిన్నవిగా వేసేవారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చవి.ఎన్నికలు కాకముందే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పోటోకే అంత ప్రాదాన్యం ఇచ్చారని, ఎన్నికల తర్వాత కూటమి గెలిస్తే ఇంకెంత ప్రాదాన్యం ఇస్తారో అన్న ప్రచారం జరిగింది.ఈ నేపద్యంలో ,కారణం ఏమో కాని, గురువారం నాడు కనిపించిన ప్రచార ప్రకటనలలో చంద్రబాబు పోటో కనిపించలేదు. ఉత్తం కుమార్ రెడ్డి పోటో మిగిలిన తెలంగాణ పార్టీల నేతల కన్నా కాస్త పెద్దది వేశారు. మరి శుక్రవారం నాడు ఇచ్చే ప్రకటనలలో చంద్రబాబు పోటో వేస్తారో,లేదో తెలియదు కాని ,ఈ రోజు అయితే ఈ మార్పు కనిపించింది. మరి చంద్రబాబు పోటో తెలంగాణలో ప్రచారం చేయడం వల్ల నష్టం వస్తోందని అనుకున్నారా?లేక మరే కారణం ఉందా?

tags : congress, add, chandrababu ,photo missing

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info