A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చింతమనేని రౌడీయిజం ఇక సాగదు
Share |
April 23 2019, 3:40 am

ఎపి టిడిపి నేత, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అరాచకాలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ద్వజమెత్తింది. చింతమనేని ప్రభాకర్‌ ఆటలు ఇక సాగవని, ఆయన పదవి ఊడటానికి ఇక నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని దెందులూరు వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరీ వ్యాఖ్యానించారు. మట్టి నుంచి ఇసుక వరకు అన్నింటిలోనూ చింతమనేని దోపిడీ పాల్పడ్డారని ఆరోపించారు. అప్పన ప్రసాద్‌పై అక్రమ కేసులు , రౌడీషీట్‌తో వేధించినా ఆయన భయపడలేదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించమని అన్నారు. చింతమనేనికి వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పడానికి దెందులూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. చింతమనేని రౌడీయిజంతో దెందులూరు ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు.

tags : ysrcongress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info