A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మధు యాష్కి వాహనంపై రాళ్లు- ద్వంసం
Share |
February 19 2019, 1:51 pm

నిజామాబాద్ మాజీ ఎమ్.పి మధు యాష్కి వాహనంపై కాంగ్రెస్ వారే దాడి చేశారు. యాష్కి జగిత్యాల జిల్లా మెట్ పల్లి వద్ద ఉండగా, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు వర్గీయులు ఆయన వాహనంపై రాళ్లు రువ్వారు.దాంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి.అక్కడ ఉద్రిక్తత ఏర్పడడంతో యాష్కి, ఒక ద్విచక్ర వాహనం ఎక్కి వెళ్లిపోయారు. ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. యాష్కికి తృటిలో ప్రమాదం తప్పించని అంటున్నారు.రాములుకు కాంగ్రెస్ టిక్కెట్ రాకుండా యాష్కి అడ్డుపడ్డారని, టిఆర్ఎస్ నుంచి వచ్చిన నరసింగరావుకు ఇప్పించారని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, స్థానికేతరుడు అయిన మధు యాష్కి మెట్ పల్లికి ఎందుకు వచ్చారన్న దానిపై కూడా విచారణ జరుగుతోంది. ఎవరినైనా ప్రలోభ పెట్టే యత్నం చేశారా అన్నదానిపై కూడా ఆరా తీస్తున్నారు.

tags : madhu yaskhi, stones

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info