A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉత్తం ఇంటి వద్ద సోదాలు జరిగాయా
Share |
December 11 2018, 12:47 am

తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఇంటి వద్దకు పోలీసులు ఎందుకు వెళ్లారో తెలియదు.దీనికి సంబందించి టీవీలలో వార్తలు రావడం లేదు. కాని మాజీ ఎమ్.పి వి.హనుమంతరావు మాట్లాడుతూ ఉత్తం కుమార్ ఇంటిపైకి ఏభై మంది పోలీసులను పంపి దాడులు చేయించారని అంటున్నారు.కేసీఆర్‌కు అంత భయమెందుకని సూటిగా అడిగారు. పోలీసులు కూడా టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేయండని చెబుతున్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్‌ ఇంటిపై, ప్రగతి భవన్‌పై పోలీసులు దాడులు చేయమంటే చేస్తారా అని ఆయన అన్నారు. 108,104 వాహనాల్లో డబ్బులు, మద్యం తరలిస్తున్నారని, కాంగ్రెస్‌, తెలుగుదేశం కార్యకర్తలు 108,104 వాహనాలను తనిఖీలు చేయాలని హనుమంతరావు అన్నారు.

tags : vh, uttam, police

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info