తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన ప్రసంగాలపై విపక్ష నేత జగన్ విరుచుకుపడ్డారు.చంద్రబాబు ప్రపంచ స్థాయిలో రికార్డులు బద్దలయ్యేలా అబద్దాలు చెప్పారని జగన్ అన్నారు. చంద్రబాబు ఏమి చెప్పినా జనం నమ్ముతారని అనుకుంటున్నారని ఆయన అన్నారు. శంషాబాద్ విమనాశ్రయం కట్టానని చంద్రబాబు అంటున్నారు.2005 లో ఎయిర్ పోర్టు పనులు ఆరంభం అయి 2008 లో పూర్తి అయింది. అప్పుడు ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి. అలాగే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వైఎస్ శంకుస్థాపన చేసి, పూర్తి చేశారు.పివి నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవే ని వైఎస్ నిర్మించారు. అదే దేశంలోనే అతి పెద్దది. ఆ తర్వాత ఐటి రంగం పరుగులు తీసింది. చంద్రబాబు హయాంలో ఐటి రంగం వృద్ది రేటు8 శాతం అయితే వైఎస్ హయాంలో 14 శాతం వృద్ది జరిగిందని అన్నారు. చంద్రబాబు టైమ్ లో ఐటి ఐదో స్తానంలో ఉంటే, వైఎస్ హయాంలో 3 వస్థానంలో ఉంది. చంద్రబాబు టైమ్ లో 900 సంస్థలు ఉంటే ,వైఎస్ టైమ్ లో 1500 సంస్థలు కొత్తగా వచ్చాయి. వైఎస్ టైమ్ లో మూడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.ఐటి ఎగుమతులు చంద్రబాబు టైమ్ లో 5 వేల కోట్లు అయితే, వైఎస్ హయాంలో 33వేల కోట్ల రూపాయలు విలువైనవి.చంద్రబాబు టైమ్ లో చేసింది హైదరాబాద్ ల రిపబ్లిక్ పోర్జ్ , ఆల్యిన్ అమ్మేశారు.నిజాం సుగర్స్ ,సహకార చక్కెర కర్మాగారాలు అమ్మేశారు. సహకార స్పిన్నింగ్ మిల్లులు అమ్మేశారు.హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని కూడా మూసేశారు.మొత్తం 54 కంపెనీలను శనక్కాయలకు అమ్మేశారు.ఇలాంటి అబద్దాలు ఆడడం లో దిట్ట అని జగన్ అన్నారు. చివరికి సెల్ పోన్ తానే కనిపెట్టానని ,కంప్యూటర్ కనిపెట్టానని,సత్య నాదెళ్ల కు కంప్యూటర్ నేర్పానని అంటారు.సిందూకు బాడ్మింటన్ నేర్పానని అంటారు.చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు, మోసాలు ..అని జగన్ విరుచుకుపడ్డారు.ఎచ్చెర్ల నియోజకవర్గంలో చిలకపాలెంలో జరిగిన భారీ బహిరంగ సబలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడని ఆయన అన్నారు. రైతులు ,మహిళలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారని అబద్దాలు చెబుతున్నారని జగన్ విమర్శించారు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అన్ని అసత్యాలు చెప్పి వచ్చారని ఆయన మండిపడ్డారు. tags : chandrababu, jagan