జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కడ నుంచి పోటీచేసేది నిర్ణయించుకోలేదు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎక్కడ నుంచి పోటీచేసేది జనవరి లేదా ఫిబ్రవరి లో ని్ర్ణయించుకుంటానని ఆయన చెప్పారు. వైఎస్ ఆర్ కాంగ్రస్ అదినేత జగన్ గుర్తించనంతమాత్రాన, జనసేకు ఉనికి లేనట్లు కాదని ఆయన అన్నారు. ఒక పిలుపుతో లక్షల మంది కవాతుకు వచ్చారని ఆయన అన్నారు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీచేస్తారేమోనని అనుకున్నారు. ఆయన అక్కడ జరిగిన సబలో ఆ రకమైన ప్రకటన కూడా చేశారు.కాని ఇప్పుడు మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. tags : pawankalyan, contest