A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పీలేరు టిడిపి నేత రాజీనామా
Share |
December 11 2018, 1:53 am

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరడంతో అంతకుముందు టిడిపి అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయిన పీలేరు నియోజకవర్గ ఇన్ చార్జీ ఇక్బాల్ అహ్మద్ ను ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు న ఆయుడు వదలివేశారట. ఇక్బాల్ కు ఒక పదవి ఇస్తానని ,ఆదుకుంటానని చెప్పారట కాని, పట్టించుకోలేదట.దాంతో ఇక్బాల్ మహ్మద్ టిడిపికి రాజీనామా చేసినట్లు వార్త వచ్చింది.తాను పాతికేళ్లుగా టిడిపి కి సేవలు అందిస్తే ఇంతవరకు న్యాయం చేయలేదని ఆయన వాపోతున్నారు. 2014లో కిరణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబం మీద పోటీచేయాలని తన మీద చంద్రబాబు ఒత్తిడి తీసుకవచ్చారని.. అందుకే పోటీచేశానన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక క్యాబినేట్‌ పదవిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.. కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని అన్నారు.నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డిని టీడీపీలో చేర్చుకునేటప్పుడు తనకు నామినేటెడ్‌ పదవిని ఇస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత పట్టించుకోలేదన్నారు. పైగా కిషోర్‌ కుమార్‌ రెడ్డికి ఇన్‌చార్జీ బాధ్యతలను ఇవ్వడమే కాకుండా.. కార్పోరేషన్‌ పదవిని కూడా ఇచ్చారన్నారు.

tags : pileru, tdp,resign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info