A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓటర్ల స్లిప్ లు తీసుకు వస్తే చాలు..
Share |
December 11 2018, 12:48 am

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయడానికి ప్రత్యేకించి గుర్తింపు కార్డులు అవసరం లేదు.ఎన్నికల సంఘం ఇప్పటికే పంపిణీ చేసిన ఓటర్ ఐడెంటిటి పేజీని తీసుకు వస్తే సరిపోతుందని అదికారులు చెబుతున్నారు. ఎవరైనా ఆ పేజీ పొందలేకపోతే ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నా ఓటు , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తయారు చేసిన మై జిహెచ్ ఎమ్.సి మొబైల్ అప్లికేషన్ లతో ఓటరు స్లిప్ ను పొందవచ్చని అదికారులు చెప్పారు.ఓటరు కార్డులోని నంబరు లేదా పేరు, ఇతర వివరాలను నమోదు చేస్తే.. ఓటు వేయాల్సిన పోలింగ్‌ కేంద్రం చిరునామాతో కూడిన పేజీ వస్తుందన్నారు. దాని ముద్రిత ప్రతిని తీసుకుని ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేయొచ్చన్నారు. లేని పక్షంలో ఏదైనా ప్రభుత్త గుర్తింపు కార్డును తీసుకెళ్లి సంబంధిత పోలింగ్‌ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. ఆ వ్యక్తి పేరు జాబితాలో ఉంటే ఓటు వేసేందుకు అనుమతిస్తారని జిహెచ్ ఎమ్.సి కమిషనర్ దాన కిషోర్ చెప్పారు. కార్డుల్లో సరైన చిరునామాలేని కారణంగా సుమారు 6 లక్షల చీటీలను పంపిణీ చేయలేకపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు ఓటరు నివాసం ఒక ప్రాంతంలో, ఓటు మరోచోట ఉండటం, బూత్‌స్థాయి అధికారులు చిరునామాను గుర్తించలేకపోవడం వంటి పలు కారణాలు ఉన్నాయంటున్నారు.

tags : elections, votes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info