A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓట్ల కొనుగోలుకు 800 కోట్లు సిద్దం చేశారా
Share |
April 23 2019, 4:04 am

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి ఓట్ల కొనుగోలుకు గాను హైదరాబాద్,శివారులలో 800 కోట్ల రూపాయలు నిల్వ చేశారని పోలీసులు అంచనా వేస్తున్నట్లు ఈనాడు పత్రిక ఒక కదనం ఇచ్చింది. ఆసక్తికరంగాఉన్న ఈ కధనంలో ఎక్కడెక్కడె ఎంత మొత్తం పెట్టి ఓట్లు కొంటున్నది వివరించారు. ఓటు రేటు రెండువేల నుంచి మూడువేల రూపాయల వరకు పలుకుతోందట.అయితే ఏ ఏ పార్టీలు ఎంతెంత దాసింది తెలియవలసి ఉంది. ఆ కదనంలోని కొన్ని బాగాలు ఇలా ఉన్నాయి.

ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో చీరెలు, ధోవతులు, టీషర్టులు, విలువైన చేతి గడియారాలను పంపిణీ చేస్తున్నారు. ఖమ్మంలో ఏజెన్సీ నియోజకవర్గాల్లో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు పంపిణీ చేస్తున్నాయి. ఖమ్మంలో రూ.2 వేల వరకు ఇవ్వాలనుకున్నా, పార్టీల మధ్య పోటీతో ఈ మొత్తం మరింతగా పెరగనున్నట్లు తెలిసింది. మధిరలో పంపిణీ బుధవారం మొదలైంది.
వరంగల్‌ జిల్లాలో ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఓటుకు రూ.3 వేల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువగా ఇస్తామని చెబుతోంది. మంగళవారం రాత్రి జనగామ జిల్లాలో పంపకాలు సాగించినట్లు సమాచారం.
బుధవారం వేకువజామున కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో కేటీపీఎస్‌ కాలనీకి సమీపంలోని బస్తీలో ఓటుకు రూ.500 నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేసినట్లు తెలిసింది.
ఎన్నికలకు రెండురోజుల ముందు రాష్ట్రమంతా నోట్ల వర్షం కురుస్తోంది.. కలుగుల్లో దాగిన ‘కట్టల’పాములు బుసలు కొడుతూ రోడ్ల మీదకు వస్తున్నాయి. గొట్టాల్లో.. కారు సీట్ల కింద.. ఎక్కడ వెతికితే అక్కడ కరెన్సీ కళ్లబడుతోంది. నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఖానాపూర్‌లలో పోటాపోటీగా పంపిణీ జరుగుతోంది. ఏజెన్సీలో ఓటుకు రూ.300 నుంచి రూ.వెయ్యి వరకు ఇస్తున్నాయి. కుటుంబంలో ఐదుగురు కన్నా ఎక్కువ ఓటర్లు ఉంటే అదనంగా మరో రూ.200 వరకు చెల్లిస్తున్నాయి. గరిష్ఠంగా కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.2 వేల వరకు ఇచ్చేందుకు పార్టీలు సిద్ధమయ్యాయని తెలిసింది.
: ఎన్నికల కమిషన్‌ డేగకళ్లతో గమనిస్తున్నా... పోలీస్‌ యంత్రాంగం విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నా... ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు కరెన్సీ కట్టలను సిద్ధం చేసుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకూ పంపిణీ చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నగదు నిల్వలను అత్యంత రహస్యంగా తరలిస్తున్నారు. ఓట్లను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో రూ.800 కోట్లను నిల్వ చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడి నుంచే డబ్బులు రహస్యంగా జిల్లాలకు తరలుతున్నాయని ఓ పోలీస్‌ అధికారి ‘ఈనాడు’కు తెలిపారు. తమ నిఘా, బయటి నుంచి వచ్చే సమాచారంతో వాహనాలను తనిఖీ చేసినప్పుడు రూ.కోట్లలో నగదు పట్టుబడుతోందని వివరించారు.

tags : cash,eeladu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info