A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆవేదనలో తెలంగాణ ఎన్నికల ముఖ్య అదికారి
Share |
December 11 2018, 12:50 am

తెలంగాణ ముఖ్య ఎన్నికల అదికారి రజత్ కుమార్ తీవ్ర ఆవేదనకు గురయ్యారట. ఆయన ఎవరిని కలుసుకోవడానికి ఇష్టపడడం లేదట.రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఆయన బాధపడ్డారని ,తాము అవసరమైన చర్యలు తీసుకోమని చెప్పామే కాని, అరెస్టు చేయాలని అనలేదని ఆయన వాపోతున్నారట.దీనిపై మీడియాలో వచ్చిన కదనం ఇలాఉంది.

ఈ నెల 4న కొడంగల్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించడాన్ని వ్యతిరేకి స్తూ రేవంత్‌రెడ్డి బంద్‌కు పిలుపునివ్వడం, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిరసనలు తెలపాలని కోరిన విషయం తెలిసిందే. రేవంత్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఫిర్యాదు చేయగా, సీఎం సభ రోజు శాంతిభద్రతల సమస్య రాకుండా ‘అవసరమైన చర్యలు’ తీసుకోవాలని మాత్రమే సీఈఓ పోలీసు శాఖకు ఆదేశించారని అధికారవర్గాలంటున్నాయి. రేవంత్‌ దుందుడుకు స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యగా ఆయనను అరెస్టు చేయాలని ఎస్పీ అన్నపూర్ణ నిర్ణయం తీసుకున్నారని, ఆయన్ను అరెస్టు చేసి తరలించకుండా గృహ నిర్బంధంలో ఉంచితే వివాదానికి అవకాశముండేది కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్‌ అరెస్టు పట్ల ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతుండటంతో సీఈఓ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. గత రెండ్రోజులుగా ఆయన విలేకరులను సైతం కలవడానికి ఇష్టపడడం లేదని కధనం.ఇన్నాళ్లు పడ్డ కష్టం వృదా అయినట్లు అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

tags : ceo, elections,highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info