A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లగడపాటి సర్వే కుట్రే- గుట్టు రట్టు చేసిన కెటిఆర్
Share |
December 11 2018, 1:20 am

విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కుట్రపూరితంగానే సర్వే అంటూ ప్రెస్ మీట్ పెట్టారా?కెటిఆర్ కు గత నెలలో పంపిన ఒక మెస్సేజ్ చూస్తే అలా అనిపించే అవకాశం ఉంది. కెటిఆర్ దానిని ఇప్పుడు బయట పెట్టారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడితోనే లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాన్ని మార్చారని కెటిఆర్ ఆరోపించారు.టిఆర్ఎస్ కు 65 నుంచి డెబ్బై సీట్లు వస్తాయని గత నెల ఇరవైన లగడపాటి తనకు మెసేజ్ పంపించారని దానిని విడుదల చేశారు. సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను బయటపెట్టేందుకే తాను ఆ మెసేజ్‌ను షేర్‌ చేయాల్సి వచ్చిందని చెప్పారు.
అయితే నవంబర్‌ 20 నాటికి ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఫలితాలు చెప్పానని, కేసీఆర్‌ వ్యూహాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నదని చెప్పిన లగడపాటి.. తన అంచనాలను మించి టీఆర్‌ఎస్‌ సీట్లు సాధించినా ఆశ్చర్యం లేదని అన్నారని కేటీఆర్‌ తెలిపారు. ఈ విషయం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ నిరూపితమైందని కేటీఆర్‌కు లగడపాటి పంపిన మెసేజ్‌లో తెలిపారు. నిజంగానే లగడపాటి పంపిన మెస్సేజ్ ల టిఆరెస్ గెలుస్తుందని ఉంది. మరి ఇప్పుడు సడన్ గా జనంలో అంత మార్పు వచ్చిందా?

tags : ktr,lagadapati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info