A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి రాజకీయాలలో జోక్యం చేసుకుంటా-కెసిఆర్
Share |
December 11 2018, 1:26 am

ఎపి ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబును ఓడించడానికి ఎపి రాజకీయాలలో జోక్యం చేసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అదినేత కెసిఆర్ స్పష్టం చేశారు. చంద్రబాబను తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు.తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీలతో జాతీయ రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తారని ప్రశ్నించగా.. జయప్రకాశ్‌ నారాయణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారని, మలిదశ తెలంగాణ ఉద్యమం తన ఒక్కడితోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. మమతా, నవీన్‌ పట్నాయక్‌ లాంటి నాయకులు కాంగ్రెస్‌ లేదా బీజేపీ కూటమితో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రజలు బలంగా కోరుకుంటే వారంతా తమ వెంటే వస్తారని దీమాగా చెప్పారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ రాజకీయ కూటమి కాదని, ప్రజల కూటమని పేర్కొన్నారు. ఫెడరల్‌ ప్రంట్‌ ప్రధాని అభ్యర్థి ఎవరని అడగ్గా సరైన సమయంలో ప్రకటిస్తామన్నారు. చంద్రబాబును ఓడించడానికి ఏపీ రాజకీయాల్లోనూ కలగజేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకోవడం తప్పుడు నిర్ణయమన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబు నమ్మరని చెప్పారు. మహాకూటమిలో కోదండరాం చేరడం సరైన నిర్ణయం కాదన్నారు.తెలంగాణ ప్రజలు తమతోనే ఉంటారన్న ధీమా వ్యక్తం చేశారు.

tags : kcr, politics, ap

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info