A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు బ్రాహ్మణ ద్వేషి
Share |
December 11 2018, 1:39 am

తెలుగుదేశం హయాంలో బ్రాహ్మణ ప్రముఖులకు అవమానాల జరగాయని వైఎస్ ఆర్ కాంగ్రెస్ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావేనని ఆయన అన్నారు.టిటిడి మాజీ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులను అన్యాయం చేయడమే కాకుండా దారుణంగా అవమానించిందని ఆయన అన్నారు.బ్రాహ్మణ ద్వేషంతో చంద్రబాబు ఉన్నారని, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా బ్రాహ్మణులకు కేటాయించలేదని తెలిపారు. అర్చకుల సమస్యలు చంద్రబాబుకు పట్టవన్నారు. జాతీయ భావనే చంద్రబాబుకు లేదని, రాబోయే రోజుల్లో 76 జీవో అమలు చేస్తామని చెప్పారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బ్రాహ్మణుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి మల్లాది విష్ణుతో కలిసి అన్ని జిల్లాల్లో పర్యటించి సమస్యలు అధ్యయనం చేస్తామని రఘుపతి తెలిపారు.

tags : kona raghupati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info