A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జూపూడి ప్రభాకరరావు ఇంటి వద్ద డబ్బు..
Share |
December 11 2018, 2:19 am

ఎపి నుంచి తెలుగుదేశం నేతలు తరలి వచ్చి ఆయా నియోజకవర్గాలలో భారీగా డబ్బు పంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే వారిలో కొందరు దొరికిపోతున్నారు. కొందరు కామ్ గా తమ పని ముగించుకుని వెళ్లిపోతున్నారు. తాజాగా ఎపి ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ఇంటి వద్ద డబ్బు పంఫిణీ జరుగుతోందన్న సమాచారంతో టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఆందోళనకుద దిగారు.పోలీసులు జూపూడి ఇంటిలో సోదాలు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు జూపూడి ఇంటి వెనుకవైపు నుంచి డబ్బు సంచులతో పరారవుతుండగా, టిఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకునే యత్నం చేయగా,ఒకరు దొరికారు. అతని పేరు గోనె శ్రీనివాస్ అని, టిడిపి నేత అని వార్తలు వస్తున్నాయి.అతని వద్ద 17.50 లక్షల రూపాయలు ఉన్నట్లు కనుగొన్నారు. మిగిలిన ఇద్దరిని కూడా పట్టుకునే యత్నాలు చేస్తున్నారు. మరో వైపు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కు చెందిన విమల్ దియేటర్ వద్ద డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణతో పోలీసులు తనిఖీ చేసి ఏడున్నర లక్షలు స్వాధీనం చేసుకున్నారు.కుకట్ పల్లిలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.ఆమెను ఎలాగైనా గెలిపించాలని టిడిపి నేతలు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారని టిఆర్ఎస్ విమర్శిస్తోంది.

tags : tdp, jup[udi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info