A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ నేత ఇంటిలో మూడు కోట్లు దొరికాయి
Share |
December 11 2018, 2:21 am

తెలంగాణలో కాంగ్రెస్ నేత ఇంటిలో భారీగా డబ్బు పట్టుబడింది. వరంగల్ జిల్లా ఖాజీపేట మండలంలోని సిద్దార్దనగర్ లో కాంగ్రెస్ నేత ఇంటి నుంచి పోలీసులు మూడు కోట్ల రూపాయలు స్వాదీనం చేసుకున్నారని కదనం.వర్ధన్నపేట నియోజకవర్గంలో ఓటర్లకు పంచడానికి వీటిని సిద్ధం చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. అమృతరావు అనే కాంగ్రెస్‌ నేత తన ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడ డబ్బు ఉంచి కొందరు కార్యకర్తల ద్వారా డబ్బు పంపిణీకి సన్నద్దం అయ్యాడని పోలీసులు చెబుతున్నారు. ఈ సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.అమృతరావుతో పాటు ఇంటి యజమాని బిన్నును పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

tags : cash, congress leader

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info