A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ ఎవరికి ఓటు వేయమన్నారో!
Share |
December 11 2018, 2:20 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఏదో ప్రకటిస్తారనుకుంటే,ఏమీ తేల్చకుండానే మిగిల్చారు. ఆయన ఒక వీడియో సందేశం ఇచ్చారని మీడియాలో కదనం వచ్చింది. ఈ నెల ఐదున తాను ఎవరికి మద్దతు ఇచ్చేది ప్రకటిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే.దాంతో అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.కాని ఆయన ఏ సంగతి చెప్పకుండానే జనరల్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లుగా ఉంది. ఆ వీడియో ందేశంలో తెలంగాణ ఇచ్చామని, రాష్ట్రాన్ని తెచ్చామని, తెలంగాణను పెంచామనే వాళ్లు ప్రస్తుత ఎన్నికల్లో మన ముందున్నారని, వారిలో ఎవరికి ఓటు వేయాలనే అయోమయం ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. అత్యంత ఎక్కువ పారదర్శకత, అత్యంత తక్కువ అవినీతితో ఎవరైతే మెరుగైన పాలన ఇవ్వగలరని భావిస్తారో వారికే ఓటు వేయాలని, దీనిపై ప్రజలంతా లోతుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని తద్వారా తెలంగాణకు బలమైన ప్రభుత్వాన్ని అందివ్వాలని ఆయన కోరారు. అంటే దీనిని బట్టి ఏమని అనుకోవాలి?ఎవరు ఎక్కువ అవినీతిపరులో ఆయన నేరుగా చెప్పడం లేదా? ఎపిలో చంద్రబాబు ప్రబుత్వంపై తీవ్ర అవినీతి విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ,టిడిపిలను కలయికను విమర్శించారు.కాని ఇక్కడ వారికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు.అయితే టిఆర్ఎస్ ను ఆయన ఈ మద్యకాలంలో విమర్శించలేదు.పైగా కొన్ని సార్లు పొగిడారు.అయినా ఆయన ఎందుకో టిఆర్ఎస్ కు ఓటు వేయాలని నేరుగా చెప్పలేదు.మరి దీని భావం ఏమిటి?

tags : pawankalyan, vote

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info