A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణను బానిసను కానివ్వకండి-కెసిఆర్
Share |
December 11 2018, 2:24 am

పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ దద్దమ్మలు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలవుతున్నారని ఆయన అన్నారు.
పేదల కంట కన్నీరు తుడవాలన్నది నా లక్ష్యం, కోటి ఎకరాలకు పచ్చని తెలంగాణ నా లక్ష్యం, తెలంగాణ గెలిచి నిలవాలి.జారి పడవద్దు..ఏమి జరుగుతోంది ఇక్కడ. ఎందుకు మాట్లాడుతున్నారు. ఓట్లు అనగానే ఆగం కావద్దు.గాలిగాల్లకు ఓట్లు వేస్తే గాలి అవుతుంది. మళ్లీ కనబడడు.దాచి ,దాచి దెయ్యాల పాలు చేయవద్దు. నేను చల్లిన విత్తనాలు మొలకెత్తి పూలుపూచి, కాయలు కాచే రోజులు.మల్లన్నసాగర్ నిండాలి. మన నీటితో తెలంగాణ అంతటా పచ్చగా కావాలి. కొద్ది సేపటి క్రితం కోదాడలో సభ జరిగింది. యావత్తు తెలంగాణ ముందు ఉన్న సవాల్ ఇది.రాహుల్ గాందీ, చంద్రబాబు నాయుడుల సభ. పక్కన ఉన్నది కాంగ్రెస్ దద్దన్న,మొద్దన్నలు.చంద్రబాబు ఏమి మాట్లాడాడు. కృష్ణా నదిలో నీళ్లు లేవు. గోదావరి నీటిని పంచుకుందాం. కృష్ణానదిలో నీళ్లు లేవంటే కాంగ్రెస్ గొర్రెలు తలలూపుతున్నాయి. మనకు వాటా లేదా?హరీష్ రావు పళ్లు పటపట కొరకాలి. మా గడ్డ మీద నిలబడి కృష్ణాలో నీళ్లు లేవని చెప్పడానికి ఎంత ధైర్యం. చంద్రబాబు కు ఏమి కావాలి?175 సీట్లు ఉన్న రాష్ట్రం వదలి, తెలంగాణలో కీలుబొమ్మ ప్రభుత్వం కావాలి. ప్రాణం పోయినా చంద్రబాబు మాటలు,ఆటలు సాగనివ్వడు కదా..కెసిఆర్..అందుకే అతను ఆంద్ర నుంచి మనుషులను తెచ్చి, ఇంటిలెజెన్స్ ను దించాడు. డబ్బు లు ఇచ్చి కొనుక్కోవచ్చనుకుంటున్నారు. కాంగ్రెస్ కు బక్క కెసిఆర్ ను చేతకావడం లేదట. ఆంద్ర కు పోయి చంద్రబాబును మోసుకు వచ్చారు.అదికారం పోయిందన్న కక్షతో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త."అని కెసిఆర్ అన్నారు.మి బిడ్డగా నేను కొట్లాడా. తెలంగాణను నా కంఠంలో బానిసను కానివ్వను..అవసరమైతే చస్తా కాని బానిస కానివ్వను.ఇప్పుడు కొట్లాడవలసింది మీరు..ఓటు వేసి మీరు కొట్లాడాలి అని కెసిఆర్ ప్రజలకు పిలుపు ఇచ్చారు.(ఇంతకు ముందు పోస్టింగ్ లో బానిసను కానివ్వండి అని పొరపాటు దొర్లింది.దయచేసి మన్నించగలరు.)

tags : kcr ,telangana, slave

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});