A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పేదవర్గాలలో టిఆర్ఎస్-అప్పర్ లో కూటమి!
Share |
December 11 2018, 2:25 am

తెలంగాణలో ఎవరు గెలుస్తారు?ఈ చర్చ జోరుగా సాగుతోంది.ఇంతవరకు వివిధ సర్వేలు టిఆర్ఎస్ కు అనుకూలంగా రాగా, విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ సర్వే వివరాలు,ప్రాతిపదిక అవేవి చె్ప్పకుండా ప్రజా కూటమి వైపు మొగ్గు చూపారు. నిజంగా అలా ఉంటే తప్పు లేదు.కాకపోతే ఆయన చెప్పి తీరు. ఆయనకు టిడిపి నేతలతో ఉన్న సంబందాల రీత్యా అనుమానాలు వస్తున్నాయి.అంతేకాదు.గత నెల ఇరవైన మంత్రి కెటిఆర్ తో షేర్ చేసుకున్న పలితాలకు ఇప్పటికి తేడా చూపించడం అనుమానాలకు తావిస్తుంది. అయినా మళ్లీ తన వాదనను బలపరచుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేశారు. కొన్నిసార్లు లగడపాటి చె్ప్పినవి రైట్ అయి ఉండవచ్చు. కొన్ని సార్లు కాకపోయి ఉండవచ్చు. అసలు ఆయన రాజకీయ జోస్యం ఎప్పుడు కరెక్టు అయ్యటట్లయితే ఆయనకు రాజకీయ సన్యాసం తీసుకుని,పరోక్షంగా ఇలా రాజకీయాలలో వేలు పెట్టవలసిన అవసరం వచ్చేది కాదు. తెలంగాణ ఎట్టి పరిస్థితిలోను రాదని జోస్యం చెబుతుండేవారు. ఈ విషయాలు పక్కన బెడితే ఆయా జిల్లాలలో పర్యటించిన మీదట నాకు అర్దం అయింది ఏమిటంటే పేద వర్డాలలో టిఆర్ఎస్ అనుకూలత కనిపించింది. అదే సమయంలో అప్పర్ క్లాస్ లో వివిధ కారణాల వల్ల టిఆర్ఎస్ వ్యతిరేకత ఏర్పడింది.నిజామాబాద్ లో ఒక హోటల్ లో పనిచేసే వ్యక్తిని ప్రశ్నించాను. టక్కున టిఆర్ఎస్ అని చెప్పాడు. ఎందుకు అని అడిగితే రైతు బందు పదకం కింద డబ్బులు ఇచ్చారుగా అని అన్నాడు.అలాగే మహబూబ్ నగర్ లో ఒక హోటల్ లో పనిచేసే వ్యక్తిని అడిగితే అతను కూడా టిఆర్ఎస్ అని అన్నాడు. అదే సమయంలో కాస్త మద్యతరగతి,ఆ పైన ఉన్న వ్యక్తులను పలకరిస్తే కొందరు టఫ్ గా ఉందని ,మరికొందరు ప్రజా కూటమి అని చెప్పారు. వారు ఎమ్మెల్యేల వైఖరి పట్ల కొంత వ్యతిరేకత ఉన్నట్లు అనిపించింది.ఏతావాతా చూస్తే పేద వర్గాలు,ప్రత్యేకించి వివిద స్కీముల కింద లబ్ది పొందినవారు ఓట్లు వేస్తే టిఆర్ఎస్ గెలుస్తుంది. అలాకాకుండా అప్పర్,మిడిల్ అప్పర్ క్లాస్ వారి ప్రభావం ఎక్కువ పడితే ప్రజా కూటమికి అవకాశం ఉండవచ్చు. అయితే లగడపాటి చెబుతున్నట్లు బిజెపికి సీట్లు పెరిగి,ఇండిపెండెంట్లు పది మంది గెలిచి, ఎమ్.ఐ.ఎమ్. ఏడు లేదా ఎనిమిది గెలిస్తే మిగిలేది తొంభై సీట్లే. వీటిలో అరవై సీట్లు ఏ పక్షానికి వస్తే వారు గెలుస్తారన్నమాట.ఇద్దరికి ఆ సంఖ్య రాకపోతే హంగ్ అవుతుందని బావించాలి.అప్పుడు ఎమ్.ఐ.ఎమ్. పార్టీ టిఆర్ఎస్ కు మిత్ర పక్షం.ఆ సీట్లు
టిఆర్ఎస్ కు ఉపయోగపడతాయి. అదే సమయంలో బిజెపి ఎవరికి మద్దతు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కు బిజెపి అసలు మద్దతు ఇవ్వదు కనుక. అప్పుడు మళ్లీ పిరాయింపుల పర్వం మొదలు కావచ్చు. అయితే ఎటో ఒకవైపు ప్రజలు మొగ్గితే ఈ చర్చే ఉండదు.

tags : telagana, trs, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info