A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పై హత్యాయత్నం కేసు-కీలక ఉత్తర్వు
Share |
December 11 2018, 2:27 am

విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణకు సంబందించి ఎన్.ఐ.ఎ దర్యాప్తు చేయించే విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.విశాఖ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగినందున చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు చేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అలాగే వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీనిపై ఒక పిల్ వేసి అసలు రాష్ట్రానికి దీనిపై విచారణ చేసే అదికారం ఉండదని, కేంద్ర సంస్థలకే అదికారం ఉంటుందని పిల్ వేశారు. వీటిపై విచారణ చేసిన హైకోర్టు ఎపి ప్రభుత్వ అబిప్రాయం కోరింది. అయితే ఈ కేసు కేంద్రం కిందకు రాదని ఎజి వాదించారు. అయితే హైకోర్టు దానితో అంగీకరించలేదు. ఈ నెల పద్నాలుగులోపు కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కాగా ఎన్.ఐ.ఎ దర్యాప్తు విషయమై కేంద్ర నివేదికను సీల్డ్ కవర్ లో అంద చేయాలని కూడా హైకోర్టు కోరింది.

tags : high court, ag,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info