A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లగడపాటి వివరణ ఇచ్చినా ...
Share |
May 24 2019, 6:44 pm

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని, కొందరు ఎమ్మెల్యే అభ్యర్ధులను మార్చాలని గతంలోనే తాను మంత్రి కెటిఆర్ కు సూచించానని మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ చెప్పారు.నవంబర్ 20 న తాను కెటిఆర్ కు పంపిన మెస్సేజ్ గురించి లగడపాటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కూటమి ఏర్పడడానికి ముందు తమ టీమ్ చేసిన సర్వే టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని, కూటమి తర్వాత ఆ పరిస్థితి మారిందని ఆయన వివరణ ఇచ్చారు. తాజాగా వరంగల్ జిల్లాలో కూడా కూడా కాంగ్రెస్ ఆదిక్యతలోకి వచ్చిందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారిని అరెస్టు చేయడం వల్ల నష్టం జరుగుతుందని తాను చెప్పానని కూడా ఆయన అన్నారు. అయితే లగడపాటి ముందే తాను కెటిఆర్ కు గతంలో ఒక మెస్సేజ్ ఇచ్చి టిఆర్ఎస్ ఆదిక్యత గురించి చెప్పానని వివరించి ఉంటే నమ్మడానికి ఆస్కారం ఉండేది.కెటిఆర్ వాట్పప్ మెస్సేజ్ ను విడుదల చేసిన తర్వాత ఈ వివరణ ఇవ్వడం వల్ల లగడపాటి కూడా కుట్రలో భాగస్వామా అన్న విమర్శకు ఆస్కారం ఇచ్చినట్లు అయిందా అన్న చర్చ జరుగుతోంది.

tags : lagadapati

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info