A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ సి.ఎమ్. రేసులోకి వచ్చినట్లేనా
Share |
April 23 2019, 3:43 am

కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేసులోకి వచ్చినట్లేనా? ఎఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం నబీ అజాద్ ఏ ఉద్దేశంతో అన్నారో కాని ,ఇవ్వాళ సి.ఎమ్. సీటులో కెసిఆర్ ఉండవచ్చు. రేపు రేవంత్ ఉండవచ్చు అని అన్నారట. సహజంగానే రేవంత్ అబిమానులకు ఇది ఉత్సాహాన్ని ఇస్తుంది. మిగిలిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఇబ్బంది అవుతుంది.రేవంత్ ను అజాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింహాన్ని బోనులో బందించి అడవిలో తిరగడం గొప్పకాదని కెసిఆర్ ను ఉద్దేశించి అన్నారు. రేవంత్‌ రెడ్డిని బయటకు వదిలి కేసీఆర్‌ కొడంగల్‌కు రావాలని సవాలు చేశారు. రేవంత్‌ను అరెస్ట్‌ చేసి ఇక్కడికి రావడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు.ఈరోజు సీఎం సీటులో కేసీఆర్‌ ఉండొచ్చని, రేపు అదే సీటులో రేవంత్‌ రెడ్డి కూడా ఉండొచ్చని అన్నారు. అర్థరాత్రి రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేసినందుకు ఆయన కుటుంబానికి, తెలంగాణ సమాజానికి కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని ఆజాద్‌ అన్నారు.

tags : revanth, azad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info