A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ పై వైసిపి నేత మండిపాటు
Share |
December 11 2018, 2:28 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్,జనసేన ల మద్య మాటల యుద్దం ముదురుతోంది.వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ ప్రదాన కార్యదర్శి రెహమాన్ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డారు. పవన్ ఒక బచ్చా అని ఆయన అన్నారు. సినిమాలలో నటించినట్లు రాజకీయాలలో నటిస్తే కుదరదని ఆయన అన్నారు.వైఎస్ పాలన గురించి మాట్లాడే హక్కు పవన్ కు లేదని ఆయన అన్నారు.పవన్ కు మతి బ్రమించిందని, ఆయనను పిచ్చాసుపత్రికి తరలించాలని రెహమాన్ అన్నారు. ఐదేళ్లకోసారి పార్టీలు మారుస్తూ కాపురం చేసే చంద్రబాబు, ఆర్నెల్లకోసారి పెళ్లాలను మార్చే పవన్‌ ఒక్కటయ్యారని ఆరోపించారు. ఏపీలోని దోచుకున్న అవినీతి సోమ్ము తెలంగాణలో ఖర్చు పెడుతున్నారని, విచ్చలవిడిగా టీడీపీ నాయకుల ఇళ్లలో నగదు దొరుకుతోందని తెలిపారు. తిత్లీ తుపాను బాధితులను మరచి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

tags : rehaman, pawan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info