A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ లో ఇంకెవరూ సమర్దులు లేరా
Share |
December 11 2018, 1:26 am

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎంతోపాటు కొడుకు, బిడ్డ, అల్లుడు తప్ప పార్టీ కార్యకర్తల్లో ఇంకెవరూ సమర్థులు లేరా? అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర పడ్నవీస్ ప్రశ్నించారు.సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీలో మాత్రమే ఒక రైల్వేస్టేషన్‌లో టీ అమ్ముకునే చాయ్‌వాలా ప్రధానమంత్రి, చిన్న కార్యకర్త ఆ పార్టీకి అధ్యక్షుడు కాగలడని తెలిపారు. 1947 ఆగస్టు 15న దేశం మొత్తానికి స్వాతంత్య్రం వస్తే.. హైదరాబాద్‌ రాష్ట్రంతోపాటు మరఠ్వాడా ప్రాంతానికి 1948 సెప్టెంబరు 17న విముక్తి లభించిందన్నారు. మహారాష్ట్రలో ఆ రోజున విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండగా.. తెలంగాణలో నిర్వహించకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవం రోజున అధికారికంగా మూడు రంగుల జెండా ఎగురుతుందని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి కేసీఆర్‌ దేవున్ని కూడా మోసగించారని ఆరోపించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

tags : padnavees

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info