A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో బిజెపి కీలకం అవుతుంది
Share |
December 11 2018, 2:34 am

శాసనసభ ఎన్నికల తర్వాత బిజెపి కీలకం అవుతుందని కేంద్ర మంత్రి,బిజెపి ఇన్చార్జీ జెపి నడ్డా అన్నారు. తెలంగాణ లో బిజెపి పట్ల ప్రజలలో ఆదరణ పెరిగిందని , అది పుంజుకుంటోందని ఆయన అబిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌ పాలనపట్ల రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, మార్పు కోసం బీజేపీకి మద్దతునిస్తారని అన్నారు. అవకాశవాద రాజకీయాల కోసం కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. బీజేపీకి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రజలు టీఆర్‌ఎస్, ప్రధానంగా కేసీఆ శాసనసభర్‌ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. హామీలు అమలుకాక మోసపోయా మనే భావన ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఒకప్పటి తెలంగాణ ఆకాంక్షలు ఇప్పుడు ఒక కుటుంబం ఆకాంక్షలుగా మారిపోయాయి. ఉద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్‌ అమలు చేయలేదు. అంతటా అసమర్థ పాలనే. అని ఆయన పేర్కొన్నారు.

tags : bjp, telangana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info