A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆగం కాకండి..గాలిగాళ్లుగెలుస్తారు..
Share |
December 11 2018, 2:12 am

‘ఆగమాగం కాకుండా.. ఆలోచించి ఓట్లు వేయాలని, లేకుంటే గాలిగాళ్లు గెలుస్తారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రజలు, ప్రజల ఎజెండా గెలవాలని, అప్పుడే మేలు జరుగుతుందన్నారు. పాలమూరు జిల్లాలో 14 సీట్లలో టీఆర్‌ఎస్‌ గెలవబోతుందని జోస్యం చెప్పారు. ‘ 58 ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో కరెంట్‌ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది? తమషా చేస్తే కరెంట్‌ రాలేదు.. కష్టపడితేనే 24 గంటల కరెంట్‌ వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని తెచ్చాం. గుంట జాగున్న రైతులకు కూడా రైతు బీమా వర్తింప జేస్తున్నాం. ఎలాంటి పైరవీలు లేకుండానే డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. కల్యాణీ లక్ష్మీతో పేదింటి ఆడపిల్లలకు అండగా ఉన్నాం. మహిళలు ప్రసవిస్తే.. ఒకప్పుడు చాలా దోపిడికి గురయ్యేవారు. ఇప్పుడు ఉల్టా డబ్బులు ఇస్తూ అమ్మఒడి వాహనంలో ఇంటి దగ్గర దింపుతున్నారు. మేం పెట్టిన సంక్షేమ పథకాలు మీ కళ్లముందే ఉన్నాయి. "అని ఆయన అన్నారు.

tags : kcr, campaign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info