A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
Share |
December 11 2018, 1:45 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశాన్ని ఉద్దరిస్తానని చెబుతూ ఆ ముఖ్యమంత్రి,ఈ ముఖ్యమంత్రిని కలుస్తున్నారని, ప్రత్యేక విమానాలలో తిరుగుతున్నారని,కాని ఒడిషా ముఖ్యమంత్రిని కలిసి ఝంఝావతి ప్రాజెక్టు విషయం మాట్లాడడానికి ఆయనకు టైమ్ దొరకలేదని ప్రజలు చెబుతున్నారని విపక్ష నేత జగన్ విమర్శించారు.గత తొమ్మిదేళ్లలో ఇక్కడి ప్రాజెక్టులు అయిన ఝంఝావతి, తోటపల్లి ప్రాజెక్టులకు ఎన్నికలకు ముందు టెంకాయలు కొట్టి జనాన్ని మభ్య పెట్టారని ఆయన అన్నారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులను పరుగులెత్తించారని, దాదాపు తొంభై శాతం ప్రాజెక్టులు పూర్తి చేశారని ,కాని ఈ నాలుగున్నరేళ్లో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేదని ప్రజలు బాద పడుతున్నారని జగన్ అన్నారు.పార్వతీపురం లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చెరకు రైతులు నాశనం అయిపోయామని వాపోతున్నారని ఆయన అన్నారు.ఇక్కడి లచ్చయ్యపేట సుగర్ ప్యాక్టీని గతంలో చంద్రబాబు శనక్కాయలకు అమ్మేసినట్లు అమ్మేశారని ఆయన చెప్పారు. పార్వతిపురం మున్సిపాల్టీలో తాగడానికి నీళ్లు మూడు రోజులకు ఒకసారి వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారని ఆయన అన్నారు.పార్వతీపురంలో అబివృద్ది కనిపించడం లేదని, కాని ఇక్కడి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు ఇద్దరూ దోపిడీ మాత్రం బాగా చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారని ఆయన అన్నారు.ఇక్కడ అంగన్ వాడి,సబ్ స్టేషన్ లలో షిప్ట్ ఆపరేటర్ల పోస్టులు,ఇలా అన్ని పోస్టులను అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు.

tags : jagan, babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info