A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
Share |
May 24 2019, 5:09 am

తనకు 40 ఏళ్ల సీనియార్టీ అని చెప్పుకొనే చంద్రబాబు.. నాలుగు పదుల వయసు నిండని వైఎస్‌ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక ప్రజలు తిరస్కరించిన యూపీఏ నేతలను కలుస్తూ ప్రజాధనంతో వారికి శాలువాలు కప్పుతున్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. విపక్ష నేత జగన్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేనని తెలిసి మనిషినే లేకుండా చేయాలన్న నీచపు పనికి ఒడిగట్టారా? అంటూ ప్రశ్నించారు. హత్యాయత్నం కుట్రలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే బండారం బయటపడుతుందని భయమా? అని నిలదీశారు. రేపు హైకోర్టు మీకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తుందనుకుంటే దానినీ వద్దంటారా?, ఎన్నికల కమిషన్, ‘సుప్రీం’ కూడా మీ నియంత్రణలో ఉండాలని అనుకుంటున్నారా? అని మండిపడ్డారు. తొలి నుంచి చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఆయనే సుప్రీం అనే స్థాయిలోకి వెళ్లారని ఆనం అన్నారు.

tags : anam, jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info