A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
Share |
December 11 2018, 1:37 am

తెలంగాణ మంత్రి కెటిఆర్ సవాల్ ను తాను స్వీకరిస్తానని శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కెటిఆర్ సవాల్ చేశారని, తాను దానిని అంగీకరిస్తున్నానని ఆయన అన్నారు. కామారెడ్డిలో తాను గెలవకపోతే సన్యాసం తీసుకుంటానని ఆయన చెప్పారు.తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కూటమి ఏర్పడిందని ఆయన అన్నారు.కెటిఆర్ తన సవాల్ కు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.తండ్రీ కుమారులిద్దరూ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ గత ఎన్నికల సమయంలో చెప్పి మాట తప్పారని గుర్తు చేశారు. ఇంటింటికి తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పారని, అయితే ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని ఆయన అన్నారు.

tags : shabbir ali,ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info