A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
Share |
December 11 2018, 12:47 am

పురాణాలలోని కఠినమైన సంస్కృత డైలాగులు చెప్పగలిగే ప్రముఖ నటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉపన్యాసాలలో మాత్రం తడబడుతుంటారు.తాజాగా ఆయన తన సోదరుడు హరికృష్ణ కుమార్తె నామినేషన్ కు హాజరైనప్పుడు వాడిన కొన్ని డైలాగులపై వ్యంగ్యోక్తులు వస్తున్నాయి. నమస్తే తెలంగాణ పత్రిక ఏకంగా మొదటి పేజిలో వాటిని ప్రచురించింది. హరికృస్ణ సంబరమాశ్చర్యం కలిగించిందని బాలకృస్ణ అన్నారట. నిజానికి దిగ్భ్రాంతి కలిగించిందని అనాలి.సంబరమాశ్చర్యాలు అంటే సంతోషంతో కూడిన ఆశ్చర్యం అని అర్దం వస్తుంది.బాలయ్య చేసిన వ్యాఖ్యలు వార్తాచానళ్లలో ప్రసారం కావడంతో తడబాటు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కౌంటర్లు పేలాయి.
బాలయ్య కామెడీ షురూ... ఏ జబర్దస్త్ ప్రోగ్రాం అవసరం లేదని వేణుగోపాల్ కాసర పోస్ట్‌చేయగా, పాపం ఏం చేస్తారు.. సీల్డ్‌కవర్ డైలాగ్స్ చదివారంటూ నెటిజన్ శ్రీనివాస్ కామెంట్ చేశారు. హరికృష్ణ మరణం సంబర.... ఆశ్చర్యాలకు గురి చేసిందా? అని సుశీలారెడ్డి ముక్తవరం ప్రశ్నించారు. ఎన్నోసార్లు హరికృష్ణను చంద్రబాబు అవమానించారు. నిజంగా హరికృష్ణ కుటుంబాన్ని గౌరవించాలంటే.. లోకేష్‌ను బరిలో దించి, ఆయన కూతురుకు మంత్రి పదవి ఇవ్వాలని నాగరాజు పోస్ట్‌చేశారు. మరోప్రశ్నగా సుహాసినిని ఎందుకు కూకట్‌పల్లి నుంచి నిలబెట్టాలని అనుకుంటున్నారని బాలయ్యను మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే... సమాధానం చెప్పలేకపోయారు. అది పార్టీ నిర్ణయం. ఊ..ఊ..ఊ.. పార్టీ. ఒక ఊ..ఊ..ఊ.. అధిష్ఠానం ఒక నిర్ణయం అంటూ స్పష్టంగా ఒక్కలైను సమాధానం చెప్పలేకపోయారు. సుహాసినిని బరిలో నిలుపడం మహిళా సాధికారిత(ఉమెన్ ఎంపవర్‌మెంట్)కు నిదర్శనమని చెప్పాలనుకున్న బాలయ్య డిక్షనరీలోనూ దొరుకని ఎంపాపవర్‌నెస్ అనే కొత్త పదాన్ని పలికారు. సుహాసినిని బరిలో నిలుపడమే హరికృష్ణకు నివాళిగా చెప్పారు. ఇక్కడ ఆమె గెలుపు అనే పదాన్ని మింగేశారు. తెలంగాణలో ప్రచారానికి వస్తానని.. రోడ్‌షో, బహిరంగ సభల్లో సైతం పాల్గొంటానని బాలయ్య ప్రకటించారు. దీంతో మా నియోజకవర్గానికి రాకుంటే అదే మేలు అంటూ కూటమి అభ్యర్థులు వ్యక్తిగత సంభాషణల్లో అభిప్రాయపడుతున్నారు. తీరా ప్రచారానికి వచ్చి తెలంగాణకు వ్యతిరేక వ్యాఖ్యలు చేయటమో, అర్థంకాని భాషలో అపార్థాలు మాట్లాడితే పడే నాలుగు ఓట్లు రాకుండాపోతాయని వ్యాఖ్యానిస్తున్నారు. అని ఆ పత్రిక కదనంలో పేర్కొన్నారు.

tags : balakrishna, comments

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info