A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ను జైలులో పెడతారట
Share |
December 11 2018, 1:43 am

నేతల ఉపన్యాసాలు బలేగా ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో మరీ తమాషాగాఉంటాయి.
గద్వాల వద్ద జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు.అది ఎలాగో చెప్పలేదు. ఎన్నికల ముందు ఇలా ప్రచారం చేయడం , ఆ తర్వాత అసలు అలాంటి మాటలే మాట్లాడనట్లు వ్యవహరించడం అన్ని పార్టీల నేతలకు మామూలే. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని, కుటుంబంలో ఇద్దరు వృద్ధులకు రూ.2 వేల చొప్పున, వికలాంగులకు రూ.3 వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని, చదువుకున్న 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తామని తెలిపారు.మాజీ ఎంపీ వీ.హన్మంతరావు మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబం దోపిడీదారుల కుటుంబంలా మారిందని విమర్శించారు.

tags : komatireddy, kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info