A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
Share |
May 24 2019, 4:14 am

మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్దులు ఒక్కోసారి ప్రమాదాలలో చిక్కుకుని మరణిస్తున్న తీరు ఆవేదన కలిగిస్తుది. వారి కుటుంబాలకే కాకుండా ఇతరులకు కూడా బాద కలుగుతుంది. విజయనగరం జిల్లాలో మడ్డువలస రిజర్వాయిర్ లో దిగిన ఇద్దరు విద్యార్దులు మరణించడం అందరిని కలచివేసింది.వీరు శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్‌ ఐటీ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామ్‌తేజ్‌తో పాటు విజయనగరం పట్టణం బాబామెట్టకు చెందిన మల్లెల సాయితరుణ్‌ మృతితో శుక్రవారం విహారానికి వంగర మండలం మడ్డువలస ప్రాజెక్ట్‌ వద్దకు బైక్‌పై వెళ్లారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే రాత్రయినా ఇళ్లకు రాకపోవడంతో వీరి తల్లిదండ్రులు కళాశాలకు ఫోన్‌ చేసి ఆరా తీశారు.ఆ తర్వాత పోలీసులకు పిర్యాదు చేయగా, సెల్ పోన్ సిగ్నల్స్ ఆధారంగా మడ్డువలస జలాశయం వద్దకు వెళ్లి అన్వేషించగా అక్కడ వీరి భౌతిక కాయాలు లభ్యం అయ్యాయి. ఆ కుటుంబాలకు వీరు గుండెకోత మిగిల్చారు.

tags : students died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info