A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
Share |
May 24 2019, 5:24 am

విశాఖపట్నం విమానాశ్రయంలో విపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు ఆయన దరించిన షర్టును కోర్టుకు సమర్పించాలని విశాఖ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.జగన్ పై కత్తితో దాడి జరిగిన తర్వాత రక్తం అంటడంతో ఆయన దానిని వదలి,వేరొక షర్ట్ వేసుకున్న సంగతి తెలిసిందే.ఘటన సమయంలో వైఎస్‌ జగన్‌ ధరించిన షర్టును అందచేయాలన్న ఉత్తర్వులపై సిట్‌ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ ఏసీపీ బీవీఎస్‌ నాగేశ్వరరావును వివరణ కోరగా ఆ చొక్కాను ఈ నెల 23న కోర్టుకు సమర్పించాలని ఆదేశించిందన్నారు. అయితే ఈ విషయంలో వైఎస్‌ జగన్, ఆయన పీఏ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరంలేదని, ఆ చొక్కాను ఎవరైనా తీసుకొచ్చి అప్పగించవచ్చని చెప్పారు.

tags : jagan, case, shirt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info