A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కుట్రే- జగన్ సంచలన ఆరోపణ
Share |
December 11 2018, 2:10 am

తనపై జరిగిన హత్యాయత్నం కుట్ర అని విపక్ష నేత జగన్ ఆరోపించారు.ఇందుకు బీజం వేసింది చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. తన పాదయాత్ర మహోద్యమ రూపం దాల్చుతున్న సందర్భంలో దీనిని నిలుపుదల చేయాలని భావించి ఈ ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. గత మార్చిలో ఆపరేషన్ గరుడ అన్నదానిని తెరపైకి తెచ్చారని, తనకు సన్నిహితుడు అయిన సినీ నటుడుతో ప్రెస్ మీట్ పెట్టించి ,దానిని ఎల్లో మీడియా లో ప్రచారం చేయించారని అన్నారు. చంద్రబబు చెప్పిన స్క్రిప్ట్ ఏమిటంటే ప్రతిపక్ష నేత పై దాడి జరుగుతుంది..దాని తో అల్లర్లు జరిగి రాష్ట్రపతిపాలనకు బిజెపి కుట్ర చేయబోందని చెప్పించారని .కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఎయిర్ పోర్టునే ఇందుకు ఎంపిక చేశారని ఆయన అన్నారు.ఎయిర్ పోర్టు లో రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి వద్ద పనిచేసే వ్యక్తి కత్తి తో హత్యా యత్నం చేశారని అన్నారు. తనపై హత్యాయత్నం జరిగిన గంటలోనే డిజిపి,హోం మంత్రి, మంత్రులు చంద్రబాబు రాసిన స్క్పిప్ట్ చదివారని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అబిమాని అని చెప్పించారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గొప్పగా పని చేయాలనుకునే వ్యక్తి హత్యాయత్నం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తన వారితో కుట్ర చేయించి ప్లెక్సీలు విడుదల చేయిస్తారని ఆయన అన్నారు.వెఎస్,విజయమ్మ పోటోలు లేకుండా గరుడ పక్షి పోటో ఉందని ఆయన అన్నారు.హత్యాయత్నం జరిగిన తర్వాత సిఐఎస్ ఎఫ్ అదికారులు వెదికితే నిందితుడు వద్ద ఎలాంటి లేఖ లేదని, కాని పది గంటల తర్వాత డిజిపి లేఖ విడుదల రాశారని,అది మడతలు కూడా ఉండవని, మూడు,నాలుగు రాతలు కనిపిస్తాయని,ఇదంతా కుట్రలుగా కనిపించలేదా అని జగన్ ప్రశ్నించారు.తాను విశాఖ లో అడుగుపెట్టగానే ఎయిర్ పోర్టులో సిసిటివీలు ఆగిపోయాయని,ఇది కుట్ర గా కనిపించలేదా అని అన్నారు.చంద్రబాబు చేసిన హేయమైన పని ఏమిటంటే , చివరికి నా తల్లి,నా చెల్లెలు చేయించిందని అనిపిస్తారు.అలా దిగజార్చిన ఈ వ్యక్తి మనిషా?అని ఆయన అన్నారు.తాను ఘటన జరిగిన వెంటనే డ్రామా ఆడలేదని, ఎవరిపై ఆభాండాలు వేయలేదని జగన్ చెప్పారు.తాను పస్ట్ ఎయిడ్ చేయించుకుని విమానంలో వెళ్లానని ,మెరుగైన ట్రీట్ మెంట్ కోసం,విమానం పైనల్ కాల్ కాబట్టి హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రికి వెళ్లానని అన్నారు.కాని చంద్రబాబు మాత్రం ఇంటికి వెళ్లానని, బిజెపివాళ్లు పోన్ చేస్తే ఆస్పత్రికి వెళ్లానని అబద్దాలు ఆడుతున్నారని అన్నారు.తన చుట్టూ ఉన్నదంతా రాష్ట్ర ప్రబుత్వ పోలీసులేనని,తాను ఎక్కడ కు వెళ్లింది తెలియదా అని అన్నారు .చంద్రబాబే హత్య చేయించడానికి ప్రయత్నిస్తారు..ఇక్కడ న్యాయం జరుగుతుందా?చంద్రబాబు కుట్ర చేయకపోతే స్వతంత్ర సంస్థతో ఎందుకు దర్యాప్తు కు అంగీకరించడం లేదని జగన్ ప్రశ్నించారు.

tags : jagan, babu, conspiracy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info