A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిబిఐ జిఓ ఆ రెండు పత్రికలకే లీక్ చేశారు
Share |
December 11 2018, 1:07 am

ఏపీలో సీబీఐ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు జారీ చేసిన జీవోను అనుకూల మీడియాకు లీకు చేయడం వెనుక ఉద్దేశం ఏంటని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ట్విటర్ లో ఆయన వ్యాఖ్యానించారు. ‘నాలుగున్నరేళ్ళలో చంద్రబాబు వందలకొద్దీ రహస్య జీవోలు జారీ చేశారు. సమాచార హక్కు చట్టానికి కూడా దొరక్కుండా వాటిని రహస్యంగా పెట్టారు. సీబీఐ ఎంట్రీ నిషేధంపై జారీ చేసిన రహస్య జీవోను తమ అనుకూల మీడియాకు లీక్‌ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? మేనేజ్‌ చేసే దారులు కనిపించకే చంద్రబాబు ఈ దారి పట్టారా?’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.ఈ జిఓను ఎపి ప్రభుత్వం కేవలం ఈనాడు,జ్యోతి పత్రికలకే లీక్ చేసింది.

tags : vijaysaireddy, cbi,leak

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info