A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
Share |
May 24 2019, 4:14 am

మంత్రి కెటిఆర్ తాను ఎలా ఉద్యోగానికి రాజీనామా చేసింది..ఉద్యమంలోకి ఎలా వచ్చింది తదితర అంశాలను హైదరాబాద్ లో జరిగిన మీడియా మీట్ లో వివరించారు.ఆయన మాటల్లోనే..
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2006లో కేసీఆర్‌ కేంద్ర మంత్రి పదవికి, ఆ తర్వాత పీసీసీ చీఫ్‌ సవాల్‌తో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. అంతకు కొన్ని నెలల ముందు అమెరికాలో నేను పనిచేసే సంస్థలో బదిలీపై హైదరాబాద్‌కు వచ్చాను. దక్షిణాసియా హెడ్‌గా అప్పడు నా వేతనం నెలకు నాలుగున్నర నుంచి ఐదు లక్షల రూపాయలు ఉండేది. కరీంనగర్‌ ఉపఎన్నిక రావడంతో మూడు నెలలు సెలవు కావాలని సంస్థను కోరా. వారు నిరాకరించడంతో ఇంట్లోనూ ఎవరికీ చెప్పకుండా రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పని చేశాను. ఉద్యమంలో పాల్గొన్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రతిపాదనను కేసీఆర్‌ తెచ్చారు. అప్పుడు కాంగ్రెస్‌ వైఖరి సరిగా లేక ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇదే తెలంగాణకు మేలు చేసింది. తెలంగాణ కోసం పని చేసే ఓ పార్టీ ఉండడానికి కారణమైంది. నేను మంత్రి అవుతానని ఊహించలేదు. ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. కేసీఆర్‌ దయ వల్ల అది జరిగింది. ఇదే ఎక్కువ. ఇంతకంటే ఏమీ కోరుకోవడంలేదు. మంత్రిగా ఉంటే సంతోషం. లేకున్నా ఏమీ లేదు. మిగతా విషయాలపై జరిగే ప్రచారాలను పట్టించుకోను. తెలంగాణకు మరో 15 ఏళ్లు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండాలి. అని కెటిఆర్ వివరించారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info