వచ్చె ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు పరాభవం తప్పదని బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నాలుగున్నర ఏళ్లలో కెసిఆర్ సచివాలయానికి రాలేదని, కాని గవర్నర్ వద్దకు మాత్రం నలభై సార్లు వెళ్లారని ఆయన విమర్శించారు.చొప్పదండి మాజీ ఎమ్మల్యే బొడిగె శోభ బిజెపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.టీఆర్‌ఎ్‌సను గెలిపించాలని కోరుతున్న ఉద్యోగ సంఘాల నేతలు.. కేసీఆర్ నుంచి ఎన్ని మూటలు అందుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన అధికారంలోకి రారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. tags : lakshman, kcr,governor