ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో మానసిక వ్యాదితో బాద పడుతున్నారని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.సిబిఐ ఎ పిలోకి రావడానికి వీలు లేదంటూ ఇచ్చిన జిఓపై ఆయన స్పందించారు.ఓటుకు నోటు కేసు బయంతో చంద్రబాబు విజయవాడ పారిపోయి వచ్చారని ,తనకు ఏదో జరుగుతుందనే ఊహలతో ఇలాంటి జిఓలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు.జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో సిబిఐ విచారణ వస్తే తన బండారం బయటపడుతుందన్న బయంతో చంద్రబాబు ఉన్నారని ఆయన అన్నారు. ఐటీ అధికారులకు సహకరించం, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని చెబుతుండమే ఇందుకు నిదర్శనమన్నారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ద్వజమెత్తారు. tags : kanna,chandrababu