A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
Share |
December 11 2018, 12:47 am

ఎపి ప్రభుత్వం సిబిఐ ఎపిలోకి రావడానికి వీల్లేదంటూ జారీ చేసిన జిఓ చెత్తకాగితంతో (టిష్యూ పేపర్) మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. విషయంపై నైనా కోర్టు ఆదిశిస్తే సీబీఐ ఎంక్వైరీ చేయవచ్చునని తెలిపారు. ప్రభుత్వం సీబీఐని రావడానికి వీల్లేదని చెబితే చెల్లదన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కల్యాణ్‌ సింగ్‌ సర్కార్‌, పప్పూ యాదవ్‌ కేసుల్లో ఇదే జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానమని పేర్కొన్నారు. జీవో ఇవ్వడమే హాస్యాస్పదమని సీనియర్‌ న్యాయవాదులు చెబుతుంటే ఎందుకు చంద్రబాబు ఐటీ రైడ్లను, సీబీని వ్యతిరేకిస్తున్నారని ఆయన అడిగారు.
కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై నేరుగా సీబీఐ దాడులు చేయవచ్చునని అన్నారు. దానికి ఎవరి అనుమతి అవసరం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, దాని ఆధీనంలో ఉన్న అంశాలపై విచారణ కావాలంటే కోరవచ్చునని ఆయన చెప్పారు.చంద్రబాబు తన 15 ఏళ్ల పాలనలో ఎప్పుడూ కూడా సీబీఐ ఎంక్వైరీ కోరలేదని ఆయన అన్నారు. ఇలాంటి జిఓలతో ఎపి పరువు పోతుందన ఆయన చెప్పారు. మీ పార్టీ నేతలపై ఐటీ దాడులు జరిగితే అది కేంద్రం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఐటీ దాడులు చేయడం ద్వారా తనను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని ఓ సీఎం చెప్పడం దారుణమన్నారు.

tags : undavalli, cbi go

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info