A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
Share |
May 24 2019, 4:14 am

విపక్ష నేత వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు లో కుట్రదారులు బయటపడకుండా చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిబిఐ ఎపికి రావడానికి వీలు లేదంటూ జిఓ ఇచ్చారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఆరోపించింది.ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇదే ప్రజాస్వామ్యమా?నియంతృత్వమా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పై ఎక్కడా సిబిఐ విచారణ జరగకుండాఉండడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని అన్నారు.జగన్ పై హత్యయాత్నం కేసులో కుట్రదారులు ఎవరో ఇంతవరకు పోలీసులు వెల్లడించలేదని, ఆ కోణంలోనే విచారణ జరగలేదని,హైకోర్టు ఒకవేళ సిబిఐకి అప్పగించితే అసలు దోషులు అంతా బయటపడతారని, తెలుగుదేశం పార్టీ బండారం బహిర్గతం అవుతుందని భయపడే చంద్రబాబు ఇలాంటి జీఓ ఇచ్చారని అన్నారు.చంద్రబాబు చర్యలు చూస్తుంటే ఎపి భారతదేశంలో ఉందా?వేరే దేశంలో ఉందా అన్న అనుమానం వస్తుందని ఆయన అన్నారు.

tags : malladi, chandrababu, cbi go

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info