A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
Share |
February 24 2019, 9:03 am

తెలుగువారి ఆత్మగౌరవాన్ని డిల్లీలో కాంగ్రెస్ వద్ద తాకట్టు పెట్టేసి,పాలనలో అవినీతి పెచ్చు మీరేలా చేసిన తెలుగుదేశం పార్టీని ఎపి నుంచి సమూలంగా తరిమికొట్టాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు. ఆయన విపక్ష నేత జగన్ పేరు ప్రస్తావించినా, ప్రదానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు.గతంలో వంద కోట్ల అవినీతి అంటే అమ్మో అనుకునే పరిస్థితి ఉండేదని, అలాంటిది ఇప్పుడు టిడిపి ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.జగన్ ,చంద్రబాబులు వద్దని, లోకేష్ అసలే వద్దని ఆయన అన్నారు. 2013 సేకరణ చట్టం అమలు చేయాలని,తాము ప్రభుత్వంలోకి వస్తే దానిని అమలు చేస్తామని అన్నారు. టిడిపి ఇందుకు వ్యతిరేకంగా ఉందని,దీనిపై రాహుల్ వైఖరి ఏమిటని ఆయన అన్నారు. కాకినాడ సీపోర్ట్స్ లైసెన్స్ రద్దు చేస్తామని కూడా ఆయన అన్నారు.

tags : pawankalyan, coruption

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info