మాజీ మంత్రి దానం నాగేందర్ పోటీచేస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో అసమ్మతిని తగ్గించడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగేందర్ టిఆర్ఎస్ తరపున పోటీచేయబెతున్న సంగతి తెలిసిందే.గతంలో ఇక్కడ పోటీచేసిన గోవర్ధనరెడ్డి తన అనుచరులతో ఆందోళనకు దిగారు. ఆయన కన్నా కార్పొరేటర్ ,దివంగత నేత పి.జనార్దనరెడ్డి కుమార్తె విజయారెడ్డి నుంచి ఎక్కువ సమస్య వస్తుందని భావించారు. అయితే మంత్రి కెటిఆర్ ఆమెతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆమె తిరుగుబాటు ఆలోచన విరమించుకున్నారని సమాచారం.దాంతో దానం నాగేందర్ విజయారెడ్డి నివాసానికి వెళ్లి తనకు మద్దతు ప్రకటించాలని కోరడంతో ఆమె ఒప్పుకున్నారు.ఇది కీలకమైన మద్దతే అని బావిస్తున్నారు. tags : danam, support, vijaya reddy